అమెరికాను మంచుతుఫాను గజగజ వణికిస్తోంది. మంచు తుపానులో చిక్కుకొని ఇప్పటివరకు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో న్యూయార్క్ వాసులే 27 మంది ఉన్నారు. పశ్చిమ న్యూయార్క్‌లో కొన్ని ప్రాంతాలు 8 అడుగుల మేర మంచులో కూరుకుపోయాయి.
ఏకధాటిగా మంచు కురుస్తూ ఉండడంతో ప్రజలు రోడ్లపైకి రావడం అసాధ్యంగా మారిందని న్యూయార్క్ గవర్నర్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 15 వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో చికాగో, డెన్వర్, డెట్రాయిట్, న్యూయార్క్, అట్లాంటా విమానాశ్రయాల్లో ప్రయాణికులు చిక్కుకుపోయారు. కొలరాడో, కన్సాస్, కెంటకీ, మిస్సోరీ, ఓహియోలో ప్రాణనష్టం అధికంగా ఉంది.
అమెరికాలో తూర్పు రాష్ట్రాలన్నీ డీప్ ఫ్రిజ్‌లో పెట్టినట్టుగా ఉన్నాయని అమెరికా నేషనల్ వెదర్ సర్వీసెస్ (ఎన్‌డబ్ల్యూఎస్) తెలిపింది.అమెరికాలోని 48 రాష్ట్రాల్లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఈ రాష్ట్రాల జనాభాలో 2 లక్షలకు మందికి పైగా విద్యుత్ సదుపాయం లేక విలవిలలాడిపోతున్నారు.ప్రజలు ఇల్లు కదిలి బయటకు రావద్దని ఎన్‌డబ్ల్యూఎస్ హెచ్చరికలు జారీ చేసింది.
Here's DD News Tweet
#USWinterStorm | 60 deaths reported as the US ravaged by severe winter storms pic.twitter.com/CpROnB7n8e
— DD News (@DDNewslive) December 27, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)