అమెరికాను మరో తుఫాను వణికించనుంది. గురువారం తుఫాను వచ్చే అవకాశం ఉన్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాలిఫోర్నియా ప్రాంత వాసులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. తుఫాను కారణంగా భారీ వర్షాలతో పాటు పెద్దఎత్తున మంచు గడ్డలు కరగి వరదలు సంభవించే ప్రమాదం ఉన్నదని NWS అధికారులు తెలిపారు.

రోడ్లపై నిలిచే నీటితో ప్రయాణానికి ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని, విద్యుత్తు సరఫరా నిలిచిపోవచ్చునని, లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో, సక్రమెంటో తీర ప్రాంతాలకు చెందిన 1.75 కోట్ల మందిపై ఈ తుఫాను ప్రభావం ఉంటుందని హెచ్చరికలు జారీ అయినట్టు సీఎన్‌ఎన్‌ వార్తా సంస్థ వెల్లడించింది.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)