న్యూజిలాండ్‌ దేశాన్ని గాబ్రియెల్ తుఫాను వణికిస్తున్నది. దేశంలోని ఉత్తర ప్రాంతాల్లో 250 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఆక్లాండ్ నగరంలో గాలి వేగం ప్రస్తుతం గంటకు 110 కిలోమీటర్లుగా ఉన్నది. ఉత్తరాది ప్రాంతాల్లో దాదాపు 46 వేల ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆక్లాండ్‌లో గత 24 గంటల్లో 4 అంగుళాల వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడి వాహనాలు ధ్వంసమయ్యాయి. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పెద్ద సంఖ్యలో విమానాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

ప్రజలను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు. రూ.60 కోట్ల సహాయక ప్యాకేజీని ప్రధాని క్రిస్ హిప్కిన్స్ ప్రకటించారు.వాతావరణం అనుకూలించకపోవడంతో దేశంలో 509 విమానాలను రద్దు చేశారు. న్యూజిలాండ్ వాతావరణ విభాగం ప్రకారం, హరికేన్ గాబ్రియేల్ ఇప్పుడే తీరం దాటింది. ఇంతలో విద్యుత్ లైన్లు, రోడ్లు, చెట్లు దెబ్బతిన్నాయి. వచ్చే 24 గంటలు కీలకమని అధికారులు పేర్కొంటున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)