Newdelhi, Nov 4: నేపాల్ (Nepal) లో శుక్రవారం భూకంపం (Earthquake) సంభవించింది. జార్కోట్ జిల్లాలో లాబిదండా ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ గుర్తించింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత కలిగిన ఈ భూకంపం ధాటికి అనేక ఇళ్లు, భవంతులు కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకుని ఇప్పటివరకూ 128కిపైగా మృతి చెందారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభావిత ప్రాంతంలోని శిథిలాల కింద ఉన్న వారిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, భూకంప ప్రభావం ఢిల్లీతో పాటూ ఉత్తరాదిన పలు ప్రాంతాల్లోనూ కనిపించింది.
At least 128 people were killed in a strong #earthquake that originated in the country's #Jajarkot district Friday midnight.#Nepal
Read more at: https://t.co/p9bEDWWqn9
— Deccan Herald (@DeccanHerald) November 4, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)