బ్రెజిల్ దేశంలో వరదలు పోటెత్తాయి. వరద విపత్తు వల్ల మృతుల సంఖ్య 204కు పెరిగింది. బ్రెజిల్ దేశంలోని ఆగ్నేయ రియో డి జనీరో రాష్ట్రంలోని పెట్రోపోలిస్ నగరంలో భారీ వరదల కారణంగా 204 మంది మరణించినట్లు బ్రెజిల్ అధికారులు చెప్పారు. కొండచరియలు విరిగిపడటంతోపాటు బురద ప్రవాహంలో చిక్కుకొని మరో 51 మంది గల్లంతు అయినట్లు రియో డిజెనీరో రాష్ట్ర అగ్నిమాపక శాఖ ప్రతినిధి చెప్పారు. వరదల వల్ల బ్రెజిల్‌లోని చారిత్రాత్మక పర్యాటక కేంద్రమైన పెట్రోపోలిస్‌ నగరంలో ఇప్పటికీ 810 మంది నిర్వాసితులు గత వారం రోజులుగా పాఠశాల శిబిరాల్లో నివశిస్తున్నారు.అతి భారీవర్షాల వల్ల మెరుపు వరదలు సంభవించడంతో ప్రాణనష్టంతోపాటు ఆస్తినష్టం సంభవించింది. వేలాది ఇళ్లు వరదల్లో దెబ్బతిన్నాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)