పిలిప్పీన్స్‌లో ఘోర విషాదం చోటు చేసుకున్న సంగతి విదితమే. డావో ప్రావిన్సు మాకో టౌన్‌లో బంగారు గని సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 54కు చేరింది. మరో 32 మంది గాయపడ్డారు. కొండ చరియల కింద ఇళ్లు, వాహనాలు కూరుకుపోయాయి.

సహాయక చర్యలు జరుగుతున్న కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడుతున్నాయని డావో ప్రావిన్సు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, బురద వల్ల రెస్క్యూ పనులకు ఆటంకం కలుగుతోంది. మళ్లీ కొండ చరియలు విరిగియ పడే అవకాశాలుండటంతో సహాయక సిబ్బంది ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. కొండ చరియలు విరిగిపడ్డప్పటి నుంచి మొత్తం 63 మంది ఆజూకీ తెలియడం లేదు.

Here's News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)