ఇండోనేషియా (Indonesia)లో ప్రధాన ద్వీపమైన జావా (Java island)తో పాటు రాజధాని జకర్తా (jakarta)లో ఆదివారం రాత్రి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 5.6గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే ( U.S. Geological Survey) తెలిపింది. భూకంప కేంద్రం పశ్చిమ జావా ప్రావిన్స్‌లోని తీరప్రాంత పట్టణమైన పెలబుహన్‌రాటుకు పశ్చిమ-నైరుతి దిశలో 80 కిలోమీటర్లు (29 మైళ్ల) దూరంలో గుర్తించినట్లు పేర్కొంది. ఆస్తినష్టం, ప్రాణ నష్టం గురించి సమాచారం ఏదీ అందుబాటులో లేదు.ఈ భూకంపం ధాటికి రాజధాని నగరం జకర్తాలో ఎత్తైన భవనాలు కొన్ని సెకన్లపాటు ఊగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.భూ ఉపరితలం నుంచి 37.2 కిలోమీటర్ల దిగువన భూకంపం చోటుచేసుకున్నట్లు తెలిపింది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)