పపువా న్యూగినియాలోని తూర్పు సెపిక్ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదయ్యింది. అంబుటి ప్రాంతంలో భూ ప్రకంపనలు మొదలయ్యాయని.. దీని కేంద్రం 35 కిలోమీటర్ల లోతులో ఉన్నదని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా కొంతమేరకు ప్రాణ నష్టం జరిగి ఉండవచ్చని అభిప్రాయపడింది. ఇక్కడ మరోసారి భూకంపం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. 1990 నుంచి పపువా న్యూగినియాలో 7.5, అంతకంటే ఎక్కువ తీవ్రతతో 22 భూకంపాలు వచ్చాయి. గత ఏడాది ఏప్రిల్ లోనూ 7.0 తీవ్రతతో ఇక్కడ శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
Here' News
Earthquake in Papua New Guinea: Quake of Magnitude 6.9 Jolts Country, No Casualties Reported #PapuaNewGuinea #Earthquake #Quake https://t.co/7IiPFPrtu0
— LatestLY (@latestly) March 24, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)