ఫిలిప్పీన్స్ మరోసారి భారీ భూకంపంతో వణికింది. శుక్రవారం దక్షిణ ఫిలిప్పిన్స్ మిందానో ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో ఈ భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొంది. అయితే, పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం మాత్రం సునామీ వచ్చే అవకాశం లేదని, భూకంప నష్టంపై తక్షన సమాచారం ఏదీ లేదని ప్రకటించింది. అయితే అ ప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఫిలిప్పీన్స్ సిస్మాలజీ ఏజెన్సీ సూచించింది.
బలమైన భూకంపంతో గోడలు దెబ్బతిన్నాయని, కంప్యూటర్‌లు కింద పడిపోయాయని దక్షిణ కోటాబాటోలోని జనరల్ శాంటోస్ నగరానికి చెందిన రేడియో అనౌన్సర్ లెనీ అరనెగో తెలిపారు. జనరల్ శాంటాస్ సిటీ విమానాశ్రయంలోని ప్రయాణికులను టార్మాక్‌కు తరలించారని భూకంపం సంభవించినప్పుడు విమాన ప్రయాణికుడు మైఖేల్ రికాఫోర్ట్ తెలిపారు. జపాన్ నుండి ఆగ్నేయాసియా, పసిఫిక్ బేసిన్ అంతటా విస్తరించి ఉన్న తీవ్రమైన భూకంప, అగ్నిపర్వత కేంద్రం "రింగ్ ఆఫ్ ఫైర్" వెంబడి ఉన్న ఫిలిప్పీన్స్‌లో భూకంపాలు తరచూ సంభవిస్తూంటాయి. దీంతోపాటు గత వారం పది రోజుల్లో పలు దేశాల్లో భూకంపాలు సంభవించిన సంగతి తెలిసిందే.
Here's Videos
VIDEO: After the earthquake that struck Davao City, a crane of a building under construction crashes.#EarthquakePH #Philippines pic.twitter.com/Gj0Dl70g7W
— Insider Corner (@insiderscorner) November 17, 2023
WATCH: Extremely chaotic scenes from a mall in General Santos City amid massive earthquake in Philippines pic.twitter.com/nMsYDmnxJg
— Insider Paper (@TheInsiderPaper) November 17, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)