సొలోమన్ ఐలాండ్స్‌లో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 7.0గా నమోదైంది. సోలోమన్ తీరానానికి 300 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మొదట 7.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు తెలిపిన అధికారులు ఆ తర్వాత దాన్ని 7.0గా సవరించారు. మొదట సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కాసేపటి తర్వాత.. ముప్పు తప్పిందని నిర్ధరించుకున్నాక ఆదేశాలు ఉపసంహరించుకున్నారు.

భూకంపం ధాటికి 20 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇళ్లు కదిలి, ఇంట్లోని టీవీ, ఇతర సామాన్లు కిందపడిపోయినట్లు పేర్కొన్నారు. ప్రజలు భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీసినట్ల వివరించారు. భూకంపం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)