గత విషాద గాయాలు మానిపోకముందే టర్కీ, సిరియాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 6.4 తీవ్రత నమోదైంది. హతాయ్ ప్రావిన్స్ డిఫ్నీ ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి ముడు అపార్ట్‌మెంట్లు కూలిపోగా.. ముగ్గురు మృతి చెందారు. మరో 200 మంది వరకు గాయపడ్డారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భూకంపం సంభవించింది సరిహద్దు ప్రాంతం కావడంతో సిరియాలోనూ భూప్రకంపనలు వచ్చాయి. ఆ దేశంలో ఆరుమంది గాయపడ్డారు.రెండు వారాల క్రితమే టర్కీ, సిరియాలో భారీ భూకంపం సంభవించగా వేల భవనాలు కుప్పకూలి 47,000 మంది శిథిలాల కింద శవాలుగా మారిపోయారు.
Here's Video
#Turkey 🇹🇷#turkeyearthquake2023
This is what Hatay looks like, where many do not seek to recover material things, the survivors yearn for miracles to find their loved ones alive👇🏻 pic.twitter.com/qCi7ca3xjQ
— Daniel Von Sáenz ☭⃠🇵🇪🇯🇪🇩🇪➕️ (@DanielS12576850) February 21, 2023
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)