పాకిస్థాన్ ఆప‌ద్ధ‌ర్మ ప్ర‌ధానిగా గుల్జార్ అహ్మ‌ద్ పేరును ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ప్ర‌తిపాదించారు. ఈ మేర‌కు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ)  నేత ఛౌధురీ ఫ‌వ‌ద్ హుస్సేన్‌ కాసేప‌టి క్రితం  ప్ర‌క‌ట‌న చేశారు. కాగా గుల్జారీ అహ్మ‌ద్ పాకిస్థాన్ సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప‌ని చేసి ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో రిటైర్ అయ్యారు. క‌రాచీకి చెందిన గుల్జార్‌.. 2019లో పాక్ చీఫ్ జ‌స్టిస్‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టి..రెండేళ్ల పాటు ఆ ప‌ద‌విలో కొన‌సాగారు.

పాక్ జాతీయ అసెంబ్లీని ర‌ద్దు చేసిన ఆ దేశ అధ్య‌క్షుడు అరిఫ్ అల్వీ దేశానికి ఆప‌ద్ధ‌ర్మ ప్ర‌ధానిగా ఎవ‌రినో ఒక‌రిని ప్ర‌తిపాదించాలంటూ ఇటు ఇమ్రాన్‌తో పాటు అటు విప‌క్ష నేతకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్ర‌మంలోనే గుల్జార్ అహ్మ‌ద్ పేరును ఇమ్రాన్ ప్ర‌తిపాదించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)