ఇరాన్‌ బాంబుల మోతతో దద్దరిలింది. ఆ దేశానికి చెందిన ప్రముఖ సైనికాధికారి జనరల్‌ ఖాసీం సులేమాని స్మారక కార్యక్రమం బుధవారం జరుగుతున్న వేళ నిమిషాల వ్యవధిలో గుర్తు తెలియని వ్యక్తులు జంట పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 103 మంది మరణించగా, 188 మందికి గాయాలయ్యాయని ఇరాన్‌ అధికారులు వెల్లడించారు. ఇరాన్‌(Iran)లో జరిగిన జంట పేలుళ్ల(twin bombings)పై భారత్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధించిందని విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)