పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) దాడులతో ఇజ్రాయెల్‌ (Israel) ఉక్కిరిబిక్కిరవుతోంది. తమ దేశంపై హమాస్ (Hamas) చేపట్టిన దాడులను ఇజ్రాయెల్‌ (Israel) ధీటుగా ఎదుర్కొంటోంది. ఇందులో భాగంగా మిలిటెంట్ల పాలనలో ఉన్న గాజా (Gaza)పై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో రాత్రికి రాత్రే గాజాలోని 200 మిలిటెంట్‌ స్థావరాలపై దాడులు చేసింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (The Israeli Air Force) తాజాగా ప్రకటించింది.

గాజాలోని 200 మిలిటెంట్‌ స్థావరాలపై నిన్న రాత్రి దాడులు చేశాం. మిలిటెంట్లు ఆయుధాలు దాచిన ఓ ప్రార్థనా మందిరం, ఒక అపార్ట్‌మెంట్‌ భవనాన్ని కూడా కూల్చేశాం. పలు సైనిక లక్ష్యాలను కూడా ధ్వంసం చేశాం’ అని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ వెల్లడించింది. మరోవైపు పాలస్తీనా వాసులు గాజాను తక్షణమే ఖాళీ చేసి అక్కడి నుంచి వీలైనంత త్వరగా వెళ్లిపోవాలని ఇజ్రాయెల్‌ సైన్యం సూచించింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)