ఇండోనేషియా (Indonesia)లోని సులవేసి ద్వీపం (Sulawesi island)లో అక్రమంగా నిర్వహిస్తున్న బంగారు గని (Gold Mine)లో కొండచరియలు విరిగిపడ్డాయి (Landslide triggered). ఈ ఘటనలో సుమారు 11 మంది మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. గోరంటాలో ప్రావిన్స్‌లోని రిమోట్ బోన్ బొలాంగో జిల్లాలో కొందరు అక్రమంగా బంగారు గనిని నిర్వహిస్తున్నారు. ఆదివారం సుమారు 35 మంది గ్రామస్థులు బంగారు గనిలో పనులు చేస్తున్నారు. ఆ సమయంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు ఒక్కసారిగా విరిగి గనిలో పనిచేస్తున్న వారిపై పడ్డాయి.
ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గోరంటాలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ ప్రతినిధి అఫిఫుద్దీన్ ఇలాహుడే తెలిపారు. ఆదివారం ఐదుగురు వ్యక్తులను కాపాడినట్లు చెప్పారు. మొత్తం 11 మంది మృతదేహాలను సోమవారం గని నుంచి వెలికితీసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో సుమారు 19 మంది గల్లంతయ్యారని.. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
Here's News
Landslide triggered by torrential rain kills 11 people at illegal gold mine in Indonesia; 19 missing https://t.co/mQHrNlNMKU
— WRAL NEWS in NC (@WRAL) July 8, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)