దక్షిణ బ్రెజిలియన్ రాష్ట్రం రియో గ్రాండే దో సుల్‌లో తీవ్రమైన వర్షాల కారణంగా పెద్ద వరదలు సంభవించాయి. చాలా పట్టణాలు నీటి అడుగున ఉండిపోయాయి. చాలా మంది ప్రజలు చనిపోగా ఉన్నవారంతా వారి ఇళ్లను ఖాళీ చేయవలసి వచ్చింది అని అధికారులు చెప్పారు. జంతువులతో చాలా మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టవలసి వచ్చింది.
అయితే, ఈ అత్యవసర పరిస్థితిలో, చాలా మంది యజమానులు వారి పెంపుడు జంతువులను తీసుకుని వెళ్ళలేకపోయారు. ఫలితంగా అనేక పెంపుడు జంతువులు వరదల్లోనే చిక్కుకుపోయాయి. అయితే, కోల్పోయిన కుక్కలు మళ్లీ వాటి యజమానులతో కలిసిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఒక వీడియోలో, వరదల నుండి రక్షించబడిన వ్యక్తి తన కుక్కలతో తిరిగి కలుస్తున్నందుకు సంతోషంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరొక వీడియోలో, ఒక రెస్క్యూ టీమ్ ఒక కుక్కను నీటి నుండి బయటకు తీసుకువచ్చి దాని యజమానికి తిరిగి ఇవ్వడం చూడవచ్చు. కొన ఊపిరితో ఉన్న కోతికి సీపీఆర్ ఇచ్చి ప్రాణం కాపాడిన ట్యాక్సీ డ్రైవర్, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Here's Videos
Rescued man reunited with his dogs in the flood-hit Brazilian state of Rio Grande do Sul.. 🥺
🎥 IG: mkparnow pic.twitter.com/8CtscC4VKr
— Buitengebieden (@buitengebieden) May 9, 2024
View this post on Instagram
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)