చైనాలోని ఇన్నర్‌ మంగోలియా ప్రాంతంలోని అల్‌గ్జా లీగ్‌ గని కూలిన ఘటనలో మృతుల సంఖ్య 5కు చేరింది. మరో 47 మంది జాడ తెలియాల్సి ఉందని చైనా అధికార వార్తాసంస్థ గురువారం తెలిపింది. భారీగా మట్టిచరియలు విరిగిపడటంతో బుధవారం ఆగిపోయిన సహాయక చర్యలను గురువారం తిరిగి ప్రారంభించారు.ఇప్పటివరకు ఐదుగురు చనిపోయినట్లు ధ్రువీకరించారు. గాయపడిన ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. 47 మంది జాడ గుర్తించాల్సి ఉంది. గత ఏడాది జరిగిన 367 గని ప్రమాద ఘటనల్లో 518 మంది చనిపోయినట్లు సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ కథనం వెల్లడించింది.

Here's Reuters Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)