పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో రోజురోజుకూ మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. లైంగికదాడులను నిరోధించడానికి అక్కడ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించింది. పంజాబ్‌ హోం మంత్రి అట్టా తరార్‌ మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు జరుగడం సమాజానికి, ప్రభుత్వానికి కూడా మంచిది కాదని, పంజాబ్‌ ప్రావిన్సులో ప్రతి రోజూ నాలుగైదు లైంగిక దాడి కేసులు నమోదవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు చెప్పారు.భద్రత విషయంలో పిల్లలకు అవగాహన కల్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. లైంగిక దాడి నిందితులను చాలామందిని ఇప్పటికే అరెస్టు చేశామని వెల్లడించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)