క‌ర్నాట‌క‌లోని హిజ‌బ్ వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. ఈ వివాదంపై ఇప్పుడు పాకిస్తాన్ కూడా స్పందించింది. పాక్ విదేశాంగ మంత్రి మ‌హ్మ‌ద్ ఖురేషీ ట్విట్ట‌ర్ వేదిక‌గా తీవ్రంగా స్పందించారు. హిజాబ్ ధ‌రించిన కార‌ణంగా మ‌హిళ‌ల‌ను విద్య నుంచి దూరం చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని, ఇది మాన‌వ‌హ‌క్కుల‌ను హ‌రించ‌డ‌మే అవుతుంద‌ని పాక్ విదేశాంగ మంత్రి ట్వీట్ చేశారు. ‘ముస్లిం పిల్ల‌ల‌ను చ‌దువు సంధ్య‌ల నుంచి దూరం చేయ‌డం అంటే.. మావ‌న హ‌క్కుల‌ను హ‌రించ‌డ‌మే. ఓ వ్య‌క్తి ప్రాథ‌మిక హక్కుల‌ను హ‌రించ‌డం స‌రైన విధానం కాదు. హిజ‌బ్ ధ‌రించిన వారిని భ‌య‌భ్రాంతుల‌కు గురి చేయ‌డం అంటే అణ‌చివేయ‌డ‌మే. ఇలా చేయ‌డం ద్వారా ముస్లింల‌ను గుప్పిట్లో పెట్టుకోవాల‌ని భార‌త ప్ర‌భుత్వం చూస్తోంది’ అంటూ పాక్ విదేశాంగ మంత్రి మ‌హ్మ‌ద్ ఖురేషీ ట్వీట్ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)