పాకిస్థాన్‌లోని పెషావర్‌లో తాలిబన్‌లు ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి మృతుల సంఖ్య 83కి పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దుర్ఘటనలో 150 మందికి పైగా గాయపడ్డారు. 100 మందికిపైగా క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పెషావర్ నగరంలో గల హై సెక్యూరిటీ జోన్‌లో ఓ మసీదులో ఈ ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించింది.
Here's Update
#BREAKING Death toll rises to 83 in Pakistan mosque blast targeting police: hospital pic.twitter.com/I3gwAnzDZO
— AFP News Agency (@AFP) January 31, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)