హమాస్‌ మిలిటెంట్లకు ఇజ్రాయెల్‌ బలగాలకు మధ్య యుద్ధంతో పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.ఈ యుద్ధంలో పట్టుబడ్డ పాలస్తీనీయుల పట్ల ఇజ్రాయెల్‌ బలగాలు దారుణంగా ప్రవర్తించిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.పట్టుబడిన పాలస్తీనీయుల్లో హమాస్‌ మిలిటెంట్లుగా భావిస్తున్న డజన్ల మందిని ఇజ్రాయెల్‌ బలగాలు బట్టలు ఊడదీసి ఊరేగించాయి.

ఊరేగింపు అనంతరం వారిని జబాలియా శరణార్థి శిబిరంతోపాటు ఇతర ఉత్తరాది ప్రాంతాలకు ట్రక్కుల్లో తీసుకెళ్లి, మోకాళ్లపై కూర్చోబెట్టి, వారి కళ్లకు గంతలు కట్టి, చేతులను వెనక్కి కట్టేసిన దృశ్యాలు ఓ వీడియో ద్వారా వెలుగుచూశాయి. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)