రష్యాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. తతర్‌స్తాన్‌లో ప్రావిన్సుల్లో జరిగిన ఈ ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో 23 మంది ఉన్నట్లు సమాచారం. పారాచ్యూట్ జంపర్లతో ఎల్ 410 విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. కాగా ఈ ప్రమాదం నుంచి ముగ్గురు బయటపడినట్లు స్థానికి మీడియా తెలిపింది.

ఇటీవల ఆగస్టు 12న తూర్పు ప్రాంతంలోని కమ్చట్కా ద్వీపకల్పంలో క్రొనొటస్కే నేచుర్ రిజర్వ్‌ కురిల్ సరస్సు వద్ద హెలికాప్టర్ కూలి 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. తాజాగా ప్రమాదం గురించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)