జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే(67) మృత్యువుతో పోరాడి ఓడిపోయారని జపాన్‌ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సాయుధుడైన దుండగుడి కాల్పుల్లో గాయపడ్డ అబేను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి.. కాపాడేందుకు వైద్యులు శాయశక్తుల ప్రయత్నించారని జపాన్‌ ప్రధాని కాసేపటి క్రితం ప్రకటించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించి పోవడంతో ఆయన్ని కాపాడడం వీలు కాలేదని అధికారులు ప్రకటించారు. శుక్రవారం ఓ సభలో ఆయన ప్రసంగిస్తుండగా.. దుండగులు రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఘటనాస్థలంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరోవైపు షింజోను కాపాడే ప్రయత్నం చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)