సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానం లండన్ నుంచి సింగపూర్ వెళుతుండగా తీవ్ర కుదుపులకు లోనయింది. ప్రయాణికుల్లో ఒకరు మృతి చెందగా మరో 30 మందికి గాయాలు అయ్యాయి. ఎయిర్ టర్బులెన్స్ కు గురైన ఈ బోయింగ్ విమానాన్ని థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బంది ఉన్నారు. మృతి చెందిన ప్రయాణికుడి కుటుంబానికి సింగపూర్ ఎయిర్ లైన్స్ సంతాపం తెలియజేసింది. వీడియో ఇదిగో, ఆకాశం నుంచి భారీ వెలుగులు విరజిమ్ముతూ రాలిపడిన ఉల్క, పట్టపగలును తలపించిన అర్థరాత్రి
విమానాలు గాల్లోకి లేచాక, గరిష్ఠ ఎత్తుకు చేరిన తర్వాత, వాయు పీడనాల్లో మార్పు కారణంగా తీవ్రమైన కుదుపులకు గురవుతాయి. దీన్నే ఎయిర్ టర్బులెన్స్ అంటారు. వాతావరణ మార్పుల కారణంగా గాలి ప్రవాహం ఒక్కసారిగా దిశను మార్చుకుంటుంది. భిన్న దిశల నుంచి వీచే పెనుగాలులకు విమానం తీవ్రంగా ఊగిపోతుంది. ఈ కుదుపులు ఒక్కోసారి కొన్ని నిమిషాల పాటు కొనసాగుతాయి.
Here's News
A Singapore Airlines Boeing 777-312(ER) aircraft (9V-SWM) operating flight SQ321 from London (LHR) to Singapore (SIN) hit an air pocket and made an emergency landing at Suvarnabhumi Airport, Bangkok (BKK) at 3:34 pm today. Initial reports indicate 20 people were injured. pic.twitter.com/1Qoly0oddL
— Rudra 🔱 (@invincible39) May 21, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)