సూడాన్‌లో పశ్చిమ కోర్డోఫాన్‌ ప్రావిన్స్‌లో బంగారు గని కూలిపోవడంతో (Gold Mine Collapse) 38 మంది మరణించారు. ప్రమాదంలో మరో 8 మంది వరకు గాయపడ్డారని, వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సూడాన్ ప్రభుత్వ మినరల్ రిసోర్సెస్ కంపెనీ తెలిపింది. సూడాన్‌ రాజధాని ఖార్టూమ్‌కు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుజా గ్రామంలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ గనిని గత కొంతకాలం క్రితమే ప్రభుత్వం మూసివేసింది. సూడాన్‌ ప్రభుత్వం గనుల్లో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడమే వరుస ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా, సూడాన్‌ దేశం 2020లో సుమారు 36.6 టన్నుల బంగారాన్ని వెలికితీసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)