తైవాన్(Taiwan) నూత‌న అధ్య‌క్షుడిగా విలియ‌మ్ ల‌యి ఇవాళ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న విక్ట‌రీ సాధించారు. తైపిలో ఉన్న ప్రెసిడెన్షియ‌ల్ ఆఫీసు బిల్డింగ్‌లో వేలాది మంది ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో ప్ర‌మాణ స్వీకారం జ‌రిగింది. ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం త‌ర్వాత మిలిట‌రీ మార్చ్‌నిర్వ‌హించారు. ఫోక్ క‌ళాకారులు కూడా ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు. తైవాన్ జాతీయ జెండాతో మిలిట‌రీ హెలికాప్ట‌ర్లు ఫ్లా పాస్ట్ నిర్వ‌హించాయి. ఇరాన్ విదేశాంగ మంత్రిగా అలీ బఘేరి, శాశ్వత మంత్రిని నియమించే వరకు యాక్టింగ్‌ మంత్రిగా కొనసాగుతారని ప్రకటించిన ప్రభుత్వం

త‌మ దేశంపై సైనిక చ‌ర్య‌ల‌ను చైనా నిలిపివేయాల‌ని ఆయ‌న తన తొలి ప్ర‌సంగంలో కోరారు. చైనా క‌వ్వింపు చ‌ర్య‌లు ప్ర‌పంచ శాంతి, సుస్థిర‌త‌కు అతిపెద్ద స‌వాల్‌గా మారుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. అయితే తైవాన్ భూభాగం త‌మ‌దే అని చైనా చెబుతున్న విష‌యం తెలిసిందే. ఆ దేశంపై ప‌దేప‌దే చైనా త‌మ మిలిట‌రీ స‌త్తాను వాడుతోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)