అమెరికాలో మంకీపాక్స్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల పంపిణీ, చికిత్సను వేగవంతం చేయనున్నారు. అమెరికాలో సుమారు 6600 కేసులు నమోదు అయ్యాయి. దీంట్లో మూడవ వంతు కేసులు న్యూయార్క్‌లో బయటపడ్డాయి. ఆ రాష్ట్రం స్వంతంగా ఎమర్జెన్సీ ప్రకటించుకుంది. కాలిఫోర్నియా, ఇలియాస్‌లోనూ అధిక కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 26వేల కేసులు నమోదు అయినట్లు అమెరికా అంటువ్యాధుల సంస్థ సీడీసీ చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
I remain committed to our monkeypox response: ramping-up vaccine distribution, expanding testing, and educating at-risk communities.
That's why today's public health emergency declaration on the virus is critical to confronting this outbreak with the urgency it warrants.
— President Biden (@POTUS) August 4, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)