అగ్రరాజ్యం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని శాన్‌ఫోర్డ్‌లో ఓ పార్టీ (Florida party)లో 16 ఏళ్ల బాలుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. ఓర్లాండోకు ఉత్తరాన 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాన్‌ఫోర్డ్‌ (Sanford)లోని కాబానా లైవ్‌ (Cabana Live)లో అర్ధరాత్రి ప్రదర్శన కోసం పెద్ద ఎత్తున జనాలు గుమిగూడారు. ఆ సమయంలో అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో 16 ఏళ్ల బాలుడు గన్‌తో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో సుమారు 10 మంది గాయపడినట్లు సెమినోల్‌ కౌంటీ షెరీఫ్‌ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. గాయపడిన వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వెల్లడించింది. ఈ ఘటనలో కాల్పులకు పాల్పడిన 16 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)