రష్యా దేశాధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) నేడు ప్రమాణ స్వీకారం చేశారు. అయిదోసారి ఆయన ఆ బాధ్యతలను చేపట్టారు. మాస్కోలోని గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్‌లో ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా జరిగింది. తన వర్క్ ఆఫీసు నుంచి ప్రత్యేక కారు రైడ్‌లో 71 ఏళ్ల పుతిన్ క్రెమ్లిన్ ప్యాలెస్‌కు వెళ్లారు.రాజ్యాంగానికి చెందిన ఒక ప్రత్యేక కాపీపై ఆయన ప్రమాణం చేశారు.
జాతీయ పార్లమెంట్‌కు చెందిన చట్టసభ ప్రతినిధులు, న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. చీఫ్ జస్టిస్ వలెరి జోర్కిన్ .. పుతిన్ అయిదోసారి అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ద్రువీకరించారు. దీంతో మరో ఆరేళ్ల పాటు రష్యా అధ్యక్షుడిగా పుతిన్ కొనసాగనున్నారు. 2000, 2004, 2012, 2018 సంవత్సరాల్లో పుతిన్ ప్రమాణం చేశారు.ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో పుతిన్ 87.28 శాతం ఓట్లతో గెలుపొందారు. ప్రతి ఏడాది 25 మంది కన్యలతో కిమ్ జోంగ్ ఉన్ శృంగారం, ఉత్తర కొరియా అధినేతపై షాకింగ్ విషయాలను వెల్లడించిన ఆ దేశ యువతి
Here's Videos
Putin takes oath as Russian President pic.twitter.com/9wmOXdbjjL
— RT (@RT_com) May 7, 2024
Putin just swore the oath of office for a 5th term.
He said the presidency is a "sacred duty"
Unless something happens along the way, Putin will be President until at least 2030
Via @nexta_tv pic.twitter.com/Aqhczw7Jns
— Visegrád 24 (@visegrad24) May 7, 2024
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)