అమెరికాలో బాంబుల్లా పేలిపోతున్న పుచ్చకాయలు అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి.అమెరికాలో లీలా ఫాడెల్ అనే మహిళ.. మర్కెట్‌కు వెళ్లి పుచ్చకాయ తెచ్చుకున్నానని, ఇంటికెళ్లి కిచెన్‌లో పెట్టగానే అది పేలిపోయిందని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఆమెతో పాటు చాలామంది కూడా అదే జరుగుతుందంటూ ట్వీట్లు చేశారు.
దీనిపై పరిశోధకులు మాట్లాడుతూ.. పుచ్చకాయలో ఒక నిర్ధిష్ట రకమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతోందని దానివల్ల సహజ చక్కెర, ఈస్ట్ అనే పదార్థాలు ఉత్పన్నం అవుతాయని అధ్యయనంలో తేలిందని తెలిపారు. పుచ్చకాయలు పేలడానికి ఫార్మెంటేషన్ మాత్రమే కారణం కాదని బ్యాక్టీరియా లేదా ఫంగల్ వ్యాధి కూడా కారణం కావచ్చని కార్నెల్‌లోని స్కూల్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ ప్లాంట్ సైన్స్ హార్టికల్చర్ ప్రొఫెసర్ డాక్టర్ స్టీవ్ రీనర్స్ అన్నారు. పంట త్వరగా చేతికి రావాలని కొందరు రసాయనాలు కలుపుతున్నారని, ఇవి పుచ్చకాయల్లో ఉండే నేచురల్ షుగర్‌తో కలిసిపోయి పేలిపోతున్నట్లు రీసెర్చ్‌లో వెల్లడైంది. అంతేకాకుండా వీటిని ఒకేసారి అధిక ఉష్ణోగ్రతలు ఉన్న చోట పెట్టడం కూడా ఈ పేలుళ్లకు కారణం కావచ్చని తెలియజేశారు.
Here's Video
Watermelons Are *Still* exploding In kitchens all over America.
This summer, we've seen watermelons foaming, oozing, and ultimately bursting on people's countertops. I know it sounds too wild to be true but there's videos and photos proof across multiple platforms, from TikTok to… pic.twitter.com/k9DQYkP16R
— ∼Marietta (@MariettaDaviz) September 6, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)