Nikhat Zareen: నిఖత్‌ జరీన్‌ పంచ్ దెబ్బకు ప్రపంచం దాసోహం, వరల్డ్ బాక్సింగ్‌ చాంపియన్‌‌గా తెలుగు తేజం, మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత విజేతలు వీరే
Nikhat Zareen (Twitter)

ప్రతిష్ఠాత్మక మహిళల వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ (Nikhat Zareen) విజేతగా నిలిచింది. గురువారం 52కేజీ ఫ్లయ్‌వెయిట్‌ విభాగంలో (World Boxing Championships 2022) జరిగిన ఫైనల్లో తను 5-0 తేడాతో జిట్‌పాంగ్‌ జుటామస్‌ (థాయ్‌లాండ్‌)ను చిత్తుగా ఓడించి స్వర్ణం అందుకుంది. మూడు రౌండ్ల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో 25 ఏళ్ల నిఖత్‌ ప్రత్యర్థిపై ఆరంభం నుంచే పదునైన పంచ్‌లతో విరుచుకుపడింది. దీంతో 30-27, 29-28, 29-28, 30-27, 29-28 స్కోరింగ్‌తో జడ్జీలు ఏకగ్రీవంగా విజేతను ప్రకటించారు.

రెండేళ్లకోసారి జరిగే ఈ మెగా టోర్నీలో వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన ఐదో భారత బాక్సర్‌గా నిఖత్‌ నిలిచింది. గతంలో మేరీ కోమ్‌, సరితాదేవి, ఆర్‌ఎల్‌ జెన్నీ, కేసీ లేఖ ఈ ఫీట్‌ సాధించారు. అయితే చివరిసారిగా 2018లో మేరీకోమ్‌ (48కేజీ) భారత్‌కు వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప సాధించగా.. నాలుగేళ్ల తర్వాత తెలంగాణ బాక్సర్‌ దేశానికి స్వర్ణం అందించింది. గతంలో జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలోనూ ఈ నిజామాబాద్‌ అమ్మాయి విజేతగా నిలువగలిగింది.

ఒళ్లు గగుర్పొడిచే వీడియో..రింగ్‌లోనే కుప్పకూలిన బాక్సర్‌, దిగ్రాంతికి గురైన క్రీడాలోకం, మూసా యమక్ మరణంపై సంతాపం ప్రకటించిన తోటి బాక్సర్లు

మరోవైపు ఈ టోర్నీలో భారత్‌ నుంచి మొత్తం 12 మంది బాక్సర్లు బరిలోకి దిగగా.. నిఖత్‌ పసిడి సహా మనీషా మౌన్‌ 57కేజీ విభాగంలో, పర్వీన్‌ హుడా 63కేజీ విభాగంలో కాంస్యాలు సాధించారు. ఓవరల్‌గా మహిళల వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో భారత్‌కు 39 పతకాలు రాగా ఇందులో 10 స్వర్ణాలు, 8 రజతాలు, 21 కాంస్యాలున్నాయి. ప్రత్యర్థి జుటామ్‌సపై నిఖత్‌ 2019 థాయ్‌లాండ్‌ ఓపెన్‌లోనూ గెలిచింది.

నిఖత్‌ కెరీర్‌ ఇలా..

2011 జూనియర్‌ వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం2014 యూత్‌ వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో రజతం2014 నేషన్స్‌ కప్‌ ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ టోర్నీలో స్వర్ణం2015 సీనియర్‌ మహిళల జాతీయ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం2019 థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో రజతం2019 ఆసియా అమెచ్యూర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం2019, 2022 స్ట్రాంజా మెమోరియల్‌ బాక్సింగ్‌ టోర్నీలో స్వర్ణాలు2022 మహిళల వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం

మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత విజేతలు: మేరీ కోమ్‌: 2002, 2005, 2006, 2008, 2010, 2018, సరితా దేవి: 2006, ఆర్‌ఎల్‌ జెన్నీ: 2006, కేసీ లేఖ: 2006, నిఖత్‌ జరీన్‌: 2022