PV Sindhu parts ways with coach Park Tae-Sang (PIC @ Twitter)

Hyderabad, FEB 24: హైదరాబాదీ బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధూ (PV Sindhu) తన కోచ్ ను మార్చేస్తోంది. నాలుగేళ్లుగా ఆమెకు కోచ్ గా వ్యవహరిస్తున్న పార్క్ టే సాంగ్‌ (Park Tae-Sang) పనితీరుపై ఆమె అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన స్థానంలో కొత్త కోచ్ కోసం వేట సాగుతోంది. ఈ విషయాన్ని పీవీ సింధూ కోచ్ పార్క్ ధృవీకరించాడు. 2023 సీజన్ ప్రారంభం అంత బాగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోచ్ పార్క్ వెల్లడించాడు. 2019 వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ నుంచి పార్క్ టే సాంగ్.. సింధుతో కలిసి పని చేస్తున్నాడు. మొదట్లో అతన్ని మెన్స్ సింగిల్స్ కోచ్ గా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నియమించినా.. తర్వాత సింధు వ్యక్తిగత కోచ్ అయ్యాడు. పార్క్ (Park Tae-Sang) కోచింగ్ లో సింధు వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ గోల్డ్, టోక్యో ఒలింపిక్స్ బ్రాంజ్ మెడల, కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ గెలిచింది.

 

View this post on Instagram

 

A post shared by PARK TAESANG (@taesang2734)

అయితే ఈ ఏడాది మాత్రం సింధు వరుస వైఫల్యాలు చవిచూసింది. గతేడాది మడమ గాయం కారణంగా చాలా కాలం పాటు ఆమె బ్యాడ్మింటన్ కోర్టుకు దూరంగా ఉంది. టోక్యోలో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ లోనూ పాల్గొనలేదు. ఈ ఏడాది మలేషియా ఓపెన్, ఇండియా ఓపెన్ లలో సింధు (PV Sindhu ) తొలి రౌండ్లలోనే ఇంటిదారి పట్టింది. బ్యాడ్మింటన్ ఏషియా మిక్స్‌డ్ టీమ్ ఛాంపియన్‌షిప్ లోనూ సింధు ఆడినా.. సెమీఫైనల్లో ఓడిపోయింది.

Ind vs Aus ICC T20 WC Semifinal: టీ 20 ప్రపంచకప్ సెమీఫైనల్ లో చతికిలపడ్డ టీమిండియా ఉమెన్స్ జట్టు, చెదిరిన ప్రపంచకప్ కల, ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా 

ఇక సింధు కోచ్ గా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు చెబుతూ పార్క్ టే సాంగ్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఈ మధ్య కాలంలో సింధు వైఫల్యాలకు కోచ్ గా తనదే బాధ్యత అని అతడు స్పష్టం చేశాడు. అందుకే ఆమె మార్పు కోసం చూస్తోందని, ఓ కొత్త కోచ్ వేటలో ఉన్నట్లు తెలిపాడు. ఆమె నిర్ణయాన్ని గౌరవించి తాను తప్పుకుంటున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు పెట్టాడు.