New Delhi, OCT 15: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో సంచలనం నమోదైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు అఫ్గానిస్థాన్ జట్టు (Afghanistan Won) షాకిచ్చింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై (England) అఫ్గానిస్థాన్ జట్టు 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ (66; 61 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. బెయిర్ స్టో (2), బట్లర్ (9), జో రూట్ (11), లివింగ్ స్టోన్ (10) లు దారుణంగా విపలం అయ్యారు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రహ్మాన్, రషీద్ ఖాన్‌లు చెరో మూడు వికెట్లు తీశారు. మహ్మద్ నబీ రెండు వికెట్లు పడగొట్టాడు. నవీల్ ఉల్ హక్, ఫారూఖీ ఒక్కొ వికెట్ తీశారు. అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ జట్టు 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. రహ్మానుల్లా గుర్బాజ్ (80; 57 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. ఇక్రమ్ అలీఖిల్ (58; 66 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. ఇబ్రహీం జద్రాన్ (28), ముజీబ్ ఉర్ రహ్మాన్ (28), రషీద్ ఖాన్ (23) లు రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ మూడు వికెట్లు తీశాడు. మార్క్ వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. లివింగ్ స్టోన్, రూట్, టాఫ్లీలు తలా ఓ వికెట్ తీశారు.
Afghanistan scripted history with a stunning upset win over defending champions England in Delhi in a thrilling #CWC23 clash 🙌#ENGvAFG | 📝: https://t.co/9T8oxF60Dt pic.twitter.com/E5c9OmRvIf
— ICC Cricket World Cup (@cricketworldcup) October 15, 2023
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ (Rahmanullah) ఆటే హైలైట్ అని చెప్పవచ్చు. అతడు ఉన్నంత సేపు బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌ను క్రిస్ వోక్స్ వేయగా సిక్స్ కొట్టిన గుర్బాజ్.. సామ్ కరన్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు. మార్క్‌వుడ్, ఆదిల్ రషీద్‌ను అతడు వదిలిపెట్టలేదు. వీరిద్దరి ఓవర్లలలో ఒక్కొ సిక్స్ బాదాడు. ఈ క్రమంలో 33 బంతుల్లో గుర్బాజ్ హాప్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత కూడా అదే దూకుడు కొనసాగించాడు.
గుర్బాజ్ రాణించడంతో అఫ్గాన్ 16 ఓవర్లకు 111/0 స్కోరుతో నిలిచింది. అయితే.. ఈ దశలో ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ (Adil) విజృంభించాడు. తన వరుస ఓవర్లలో ఇబ్రహీం జాద్రాన్, రహ్మత్ షా (3)లను ఔట్ చేశాడు. కాగా.. రహ్మత్ షా ఔటైన తరువాతి బంతికే శతకం దిశగా దూసుకువెలుతున్న గుర్బాజ్ రనౌట్ కావడంతో అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో స్కోరు వేగం మందగించింది. ఇక్రమ్ అలీఖిల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సహచరులు వెనుదిరుగుతున్నా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టాప్లీ వేసిన 48 ఓవర్‌లో సిక్స్ కొట్టిన అతడు అదే ఓవర్ చివరి బంతికి ఔట్ అయ్యాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఫారూఖీ (5) రనౌట్ కావడంతో మరో బంతి మిగిలి ఉండగానే అఫ్గాన్ ఆలౌటైంది.