పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే న్యూజిలాండ్ (NZC), అర్ధాంతరంగా సిరీస్ ఆరంభానికి ముందు సెక్యూరిటీ రీజన్ తో వెనక్కి వెళ్లిపోవడంతో తీవ్రంగా నష్టపోయిన దాయాది దేశానికి మరో దెబ్బ తగిలింది... న్యూజిలాండ్ ఎఫెక్ట్‌తో ఇంగ్లాండ్ కూడా పాక్ టూర్‌ను రద్దు (England Withdraws Pakistan Tour) చేసుకుంటున్నట్టు ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ప్రకటించింది. మొదటి వన్డే సిరీస్ ఆరంభానికి ముందు సెక్యూరిటీ కారణాలతో టూర్‌ను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించి, స్వదేశానికి న్యూజిలాండ్ పయనమైంది. కివీస్ బోర్డు చేసిన పనితో ఇంగ్లాండ్ జట్టు కూడా ఆలోచనలో పడింది.
రిస్క్ చేయడం ఇష్టం లేదంటూ ఇప్పుడు పాక్ టూర్‌ను రద్దు చేసుకుంటున్నట్టు (England Also Cancels Pakistan Tour) ప్రకటించింది. కాగా ఈ ఏడాది ఆరంభంలో టీ20 వరల్డ్‌కప్ ఆరంభానికి ముందు పాకిస్తాన్‌లో రెండు టీ20 మ్యాచులు ఆడేందుకు అంగీకరించింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. రావల్పిండి వేదికగా అక్టోబర్ 13, 14 తేదీల్లో ఈ టీ20 ఈ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది... అలాగే ఇదే సమయంలో ఇంగ్లాండ్ మహిళా జట్టు కూడా పాక్‌లో పర్యటించాల్సి ఉంది.
Here's England Cricket Update
"We can confirm that the Board has reluctantly decided to withdraw both teams from the October trip."
🇵🇰 #PAKvENG 🏴
— England Cricket (@englandcricket) September 20, 2021
అయితే పాక్ పర్యటనకి వెళ్లిన న్యూజిలాండ్, టూర్ ఆరంభానికి ముందే భయభ్రాంతులతో వెనక్కి తిరిగి రావడంతో పాక్‌తో సిరీస్‌లను రద్దు చేసుకుంటున్నట్టు ఇంగ్లాండ్ ప్రకటించింది.
మా ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్ మానసిక సంక్షేమాన్ని, శారీరక భద్రతను దృష్టిలో ఉంచుకుని, క్లిష్ట పరిస్థితుల్లో పాకిస్తాన్‌లో పర్యటించడం క్షేమం కాదని భావించి... ఈ టూర్‌ను రద్దు చేస్తున్నాం... ఇప్పటికే చాలా రోజుల నుంచి కరోనా ప్రోటోకాల్, కోవిడ్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్లేయర్లను, పాక్ టూర్‌తో మరింత రిస్క్‌లోకి నెట్టలేం.. మా నిర్ణయం పీసీబీని నిరుత్సాహపరుస్తుందని తెలుసు, అయితే వారితో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించేందుకు మేం ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలుపుతూ, టూర్‌ను రద్దు చేసుకుంటున్నందుకు క్షమాపణలు చెబుతున్నా...’ అంటూ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటన ద్వారా తెలియచేసింది.