టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్ (Pakistan vs Australia Semi Final) ఓడిపోయిన ఇంటిదారి పట్టిన సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఆటగాడు రిజ్వాన్ (Mohammad Rizwan) కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ పాకిస్తాన్ ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్ కి రెండ్రోజుల ముందు రిజ్వాన్ .. ఛాతీలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు.
రెండు రాత్రులు ఐసీయూలోనే (After Spending Two Nights in ICU) ఉన్నాడు. మ్యాచ్‌కు ముందు రోజు కోలుకున్నాడు. అతని (Pakistan's Mohammad Rizwan) ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడటంతో మ్యాచ్‌కు దూరంగా ఉండమని సూచించినప్పటికీ రిజ్వాన్ తాను ఈ కీలక మ్యాచ్‌లో ఆడి తీరతానని పట్టుబట్టాడట. ఫిట్‌గా ఉన్నాడని నిర్ధారించాక ఆడేందుకు అనుమతించారు.
ఆసీస్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ క్రికెట్ దిగ్గజం షోయబ్ అక్తర్ దీనికి సంబంధించిన ఫోటోను షేర్ చేశాడు. పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ మ్యాచ్ కు ముందు రెండ్రోజులు రిజ్వాన్ ఐసీయూలో చికిత్స పొందాడని ఆ పోస్టులో అక్తర్ వెల్లడించారు. కాగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో రిజ్వాన్ అద్భుతంగా రాణించి 67 పరుగులు నమోదు చేశాడు.
Here's Shoaib Akhtar Tweet
Can you imagine this guy played for his country today & gave his best.
He was in the hospital last two days.
Massive respect @iMRizwanPak .
Hero. pic.twitter.com/kdpYukcm5I
— Shoaib Akhtar (@shoaib100mph) November 11, 2021
అనారోగ్యం ఛాయలేవీ కనిపించకుండా అద్భుతంగా ఆడాడు. ఆపై వికెట్ కీపింగ్ కూడా ఎంతో మెరుగ్గా చేశాడు. అంతేకాదు ఈ మ్యాచ్‌లో మహ్మద్ రిజ్వాన్ ఒక సంవత్సరంలో 1000 అంతర్జాతీయ టీ20 పరుగులు చేసి రికార్డును సృష్టించాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ సృష్టించాడు.