Sharajah, AUG 28: ఆసియా కప్‌లో (Asia Cup) భారత్ (India) బోణీ కొట్టింది. దాయాది జట్టు పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. పాకిస్థాన్ (Pakistan) ఇచ్చిన టార్గెట్ ను చేధించేందుకు ఆరంభంలో తడబడినప్పటికీ...చివరి వరకు జరిగిన ఉత్కంఠపోరులో విజేతగా నిలిచింది. ఐదు వికెట్ల తేడాతో మ్యాచ్ గెలుపొందింది. పాక్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని 2 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. అయితే స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (0) (KL Rahul) తను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ (29 నాటౌట్).. కెప్టెన్ రోహిత్(4 నాటౌట్)కు జత కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు.వీళ్లిద్దరూ అనవసర షాట్లకు పోకుండా నిదానంగా ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో పవర్‌ప్లే ముగిసే సరికి భారత జట్టు ఒక వికెట్ నష్టానికి 38 పరుగులతో నిలిచింది.
ఇక ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ (18)ను (Suryakumar) నసీమ షా క్లీన్ బౌల్డ్ చేశాడు. నసీమ్ డెలివరీని సరిగా అంచనా వేయలేకపోయిన సూర్య.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత జట్టు 89 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో నిలిచింది. Asia Cup 2022, India vs Pakistan: క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇక పండుగే!
కానీ ఆ తర్వాత నిలదొక్కుకొని ఆటను తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. బౌలింగ్ లో మెరిసిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) బ్యాటింగ్ లోనూ చెలరేగాడు. జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు.