Asia Cup: ఆసియాకప్ లో దాయాదుల పోరుకు సర్వం సిద్ధం.. నేటి మధ్యాహ్నం 2.30 గంటలకు పల్లెకెలెలో మ్యాచ్
India Vs Pak (Credits: X)

Newdelhi, Sep 2: ఆసియాకప్‌ (Asia Cup) లో నేడు అసలైన మజా. చిరకాల ప్రత్యర్థులైన భారత్ (India)-పాకిస్థాన్ (Pakisthan) జట్ల మధ్య నేడు శ్రీలంకలోని (Srilanka) పల్లెకెలెలో మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఈ మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేటి మ్యాచ్‌లో భారత జట్టు ఫేవరెట్‌ గా బరిలోకి దిగుతుండగా, ఆసియాకప్ ఆరంభ మ్యాచ్‌లో నేపాల్‌ను చిత్తుగా ఓడించిన పాకిస్థాన్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది.

Naresh Goyal Arrest: జెట్ ఎయిర్‌ వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ అరెస్ట్.. కెనరా బ్యాంకును మోసగించినందుకు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అదుపులోకి

తర్వాత వన్డే మ్యాచ్‌

ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఎదురుపడుతున్న భారత్‌, పాకిస్థాన్‌ మధ్య చాన్నాళ్ల తర్వాత వన్డే మ్యాచ్‌ జరగనుంది. 2019 వన్డే ప్రపంచకప్‌ లో చివరిసారి తలపడ్డ ఈ రెండు జట్లు.. శనివారం ఆసియాకప్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆ వరల్డ్‌ కప్‌ తర్వాత కూడా భారత్‌, పాక్‌ మధ్య మ్యాచ్‌లు జరిగినా.. వన్డే ఫార్మాట్‌లో మాత్రం ఇదే మొదటిది.

Bombay High Court: మొదటి భార్యకు విడాకులివ్వకుండా రెండో పెండ్లి లైంగికదాడే.. బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు