టీమిండియాకు కాంపా, ఆటంబర్గ్ టెక్నాలజీస్ సంస్థలు భారత క్రికెట్ అధికారిక స్పాన్సర్లుగా వ్యవహరిస్తాయని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వెల్లడించింది. 2024-26 సీజన్లలో భారత దేశవాళీ క్రికెట్ తో పాటు, టీమిండియాకు కూడా ఈ రెండు సంస్థలు స్పాన్సర్లుగా కొనసాగుతాయని బీసీసీఐ వివరించింది.

ఇప్పటివరకు టీమిండియాకు డ్రీమ్ 11 సంస్థ స్పాన్సర్ గా వ్యవహరించింది. జనవరి 11 నుంచి ఆఫ్ఘనిస్థాన్ తో జరిగే సిరీస్ కోసం టీమిండియా ఆటగాళ్లు కొత్త స్పాన్సర్ల లోగోలతో ఉన్న దుస్తులు, కిట్లు ఉపయోగించనున్నారు. కాంపా సంస్థ రిలయన్ గ్రూప్ నకు చెందిన శీతలపానీయాల సంస్థ. ఇక, ఆటంబర్గ్ కూడా భారత్ కే చెందిన గృహోపకరణాల సంస్థ.

Here's BCCI Twet

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)