ముంబై: క్రికెట్ అభిమానులకు బీసీసీఐ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఐపీఎల్ 2022 టోర్నీ పూర్తి షెడ్యూల్ ను ప్రకటించింది బీసీసీఐ పాలకమండలి. దాని ప్రకారం మార్చి 26వ తేదీన ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ సీజన్ 15లో ఫస్ట్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ - రన్నరప్ కోల్ కలతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది.
ఐపీఎల్-15 సీజన్ మొత్తం 65 రోజుల పాటు జరగనుంది. మొత్తం 70 లీగ్ మ్యాచ్ లు జరుగనున్నాయి. మరో నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి. మే22న చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. ముంబయిలోని వాంఖడే, డీవై పాటిల్ స్టేడియాల్లో 20 మ్యాచ్ లు చొప్పున జరగనుండగా… పుణేలోని ఎంసీఏ స్డేడియంలో, ముంబైలోని బ్రబోర్న్ స్టేడియాల్లో 15 మ్యాచ్ ల చొప్పున జరుగుతాయి.
మధ్యాహ్నం జరిగే మ్యాచ్ 3.30లకు ప్రారంభంకానుండగా .. రాత్రి మ్యాచ్ గం. 7.30లకు స్టార్ట్ కానుంది. మే 22న హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగే పోరుతో లీగ్ పోరు ముగుస్తుంది. ప్లే ఆఫ్స్ తేదీలను.. ఫైనల్ వేదికను త్వరలో వెల్లడిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు.
Hello Fans 👋
Set your reminders and mark your calendars. 🗓️
Which team are you rooting for in #TATAIPL 2022❓🤔 pic.twitter.com/cBCzL1tocA
— IndianPremierLeague (@IPL) March 6, 2022
పూర్తి మ్యాచుల షెడ్యూల్ తేదీల వారీగా వివరాలు పై ట్వీట్ లో చూడండి..