జూలై 12 నుంచి ప్రారంభం కానున్న టీమిండియా (Team India) వెస్టిండీస్ టూర్‌కు సెలెక్టర్లు టెస్ట్, వన్డే జట్లను (Test and ODI squad) ప్రకటించారు. ఈ పర్యటనలో భారత జట్టు టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్, టీ20 సిరీస్‌లను ఆడనుంది. ప్రస్తుతానికి సెలక్టర్లు టెస్ట్, వన్డే సిరీస్‌లకు మాత్రమే జట్లను ప్రకటించారు. టీ20 సిరీస్‌కు ఇంకా ప్రకటించలేదు. సెలెక్టర్లు మరోసారి రోహిత్‌కే కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు.
టెస్ట్ ప్లేయర్ చటేశ్వర్ పుజారాపై (Cheteshwar pujara) వేటు పడగా.. అంతా ఊహించనట్టుగానే ఐపీఎల్‌లో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad), యశస్వి జైస్వాల్‌కు(Yashasvi Jaiswal) టెస్ట్ టీంలో చోటు దక్కింది.వీరిద్దరితో పాటు 2021 నుంచి జట్టుకు దూరంగా ఉన్న పేసర్ నవదీప్ సైనీకి సెలక్టర్లు మళ్లీ పిలుపునిచ్చారు. టెస్టు జట్టులో అతడికి ఛాన్స్ లభించింది. మొత్తం 16 మందితో కూడిన టెస్ట్ జట్టును సెలెక్టర్లు ప్రకటించారు.
చేతేశ్వర్ పుజారా ఔట్, రుతురాజ్ గైక్వాడ్ ఇన్, వెస్టిండీస్ టూర్ కోసం భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
విండీస్‌తో టెస్టులు, వన్డేల్లో భారత జట్టుకు రోహిత్ శర్మనే సారధ్యం వహించనున్నాడు.ఐపీఎల్‌లో అదరగొట్టిన యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్, రుత్‌రాజ్ గైక్వాడ్‌కు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. వీరిద్దరితో పాటు 2021 నుంచి జట్టుకు దూరంగా ఉన్న పేసర్ నవదీప్ సైనీకి సెలక్టర్లు మళ్లీ పిలుపునిచ్చారు. టెస్టు జట్టులో అతడికి ఛాన్స్ లభించింది.
వెటరన్ ఆటగాడు చతేశ్వర్ పుజరాను సెలక్టర్లు పక్కన పెట్టారు. అదే విధంగా విండీస్‌తో టెస్టులకు మరో వెటరన్ ఆటగాడు అజింక్యా రహానే వైస్ కెప్టెన్‌గా సెలక్టర్లు నియమించారు. ఇక ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్‌కు టెస్టు, వన్డే జట్టు రెండింటిలో కూడా సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు.
హార్దిక్ పాండ్యా (Hardik Pandya) వన్డేల్లో వైస్ కెప్టెన్ కొనసాగనున్నాడు. మొత్తం 17 మందితో కూడిన వన్డే జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. కాగా గాయాల నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు వన్డే జట్టులో చోటు దక్కింది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ఉమ్రాన్ మాలిక్ తమ స్థానాలను నిలుపుకున్నారు.
ఇక విండీస్ పర్యటనలో భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. అయితే టీ20లకు త్వరలో భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జూలై 12 నుంచి 25 మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్.. 27 నుంచి ఆగస్టు 1 మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది.
విండీస్‌తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.