T20 World Cup 2021: హైదరాబాద్‌లో టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్, మొత్తం 9 నగరాల్లో వేదికలను ఖరారు చేసిన బీసీసీఐ, నరేంద్ర మోదీ స్టేడియంలో వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్, పాక్ ఆటగాళ్లకు వీసా లైన్ క్లియర్
ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు వేదికలు ఖరారయ్యాయి. వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లను అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఇక ఆ టోర్నీకి (T20 World Cup 2021) ఇతర వేదికల పేర్లను కూడా రిలీజ్ చేశారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగుళూరు, హైదరాబాద్, ధర్మశాల నగరాల్లో టీ20 మ్యాచ్‌లు (BCCI picks nine venues for ICC T20 World Cup 2021) జరగనున్నాయి.

హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడొకరు ఈ వివరాలను వెల్లడించారు. కాగా టీ20 క్రికెట్ వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.
టోర్నీ ఫైనల్ ను అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium in Ahmedabad) నిర్వహించనున్నట్టు ఐసీసీ సభ్యుడు తెలిపారు. ఇటు బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పాకిస్థాన్ క్రికెట్ టీం.. ఇండియాకు రావడానికీ అడ్డంకులు దాదాపుగా తొలగిపోయినట్టు సమాచారం. పాక్ క్రికెటర్లకు కేంద్ర ప్రభుత్వం వీసాలు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అపెక్స్ కౌన్సిల్ కు బీసీసీఐ సెక్రటరీ జై షా వివరించారని అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు చెప్పారు.
పాక్ క్రికెటర్ల వీసా సమస్య తొలగిపోయినట్టే. అయితే, విదేశీ క్రికెట్ అభిమానులకు అనుమతినిస్తారా? లేదా? అన్న దానిపై మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం జరగలేదు’’ అని ఆయన వివరించారు. త్వరలోనే అభిమానులను అనుమతించే విషయంపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఈ అంశంలో ఐసీసీకి ప్రామిస్ ఛేశామన్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య రాజకీయ సంబంధాలు తెగిపోవడం వల్ల ఈ రెండు దేశాలు చాలా ఏళ్ల నుంచి ద్వైపాక్షిక టోర్నీల్లో పాల్గొనడం లేదు.
కాగా, కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉందన్న కారణంతో హైదరాబాద్ ను ఐపీఎల్ మ్యాచ్ లకు ఎంపిక చేయని సంగతి తెలిసిందే. తాజాగా టీ20 వరల్డ్ కప్ కు హైదరాబాద్ నూ వేదికగా ఎంపిక చేశారు.
(The above story first appeared on LatestLY on Apr 17, 2021 01:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).