Jay Shah become ICC Chairman(ANI)

Hyd, July 18:  ఐసీసీకి త్వరలో కొత్త అధ్యక్షుడు రానున్నారా? ఆ అధ్యక్షుడు బీసీసీఐ కార్యదర్శి జై షానా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి(ICC) వార్షిక సమావేశాలు రేపటి(జూలై 19) నుండి శ్రీలకంలోని కొలంబో వేదికగా జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఐసీసీ నూతన ఛైర్మన్ ఎన్నిక అంశంతో పాటు ఐసీసీ బోర్డ్ డైరెక్టర్స్‌లో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎజెండాతో పాటు ప్రధానంగా పాకిస్థాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫికి భారత్ వెళ్తుందా అన్న దానిపై చర్చ ఉండే అవకాశం ఉంది.

ఇక ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్‌గా న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్క్‌లే ఉన్నారు. ఈసారి ఐసీసీ ఛైర్మన్ రేసులో జై షా ఉంటారని కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిని ఎక్కడా జైషా ఖండించలేదు. ఒకవేళ జై షా పోటీలో ఉంటే ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉంది. లేటెస్ట్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్, టాప్ టెన్‌ బౌలర్లలో భారత్ ఆటగాళ్లకు దక్కని చోటు, బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 6వ ప్లేసులోకి దూసుకొచ్చిన యశస్వి జైస్వాల్

బీసీసీఐ రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి 6 ఏళ్ల పాటు మాత్రమే పదవికో కొనసాగాల్సి ఉంటుంది. చాలా సంవత్సరాలుగా బీసీసీఐ కార్యదర్శిగా జై షా ఉంటున్న నేపథ్యంలో ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకుంటే 2028లో జైషాకి బీసీసీఐ పదవి అందుకోవడానికి లైన్ క్లీయర్ అవుతుంది. సో మొత్తంగా జై షా ఐసీసీ ఛైర్మన్ రేసులో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.