
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య పాకిస్తాన్ పరాజయం పాలైన సంగతి విదితమే. కరాచీ వేదికగా జరిగిన న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 320 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో 60 పరుగుల తేడాతో దాయాది దేశం ఓటమి పాలైంది. 320 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక పాక్ చతికలపడింది.ఈ నేపథ్యంలో పాక్ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ ఆక్మల్ విమర్శలు గుప్పించాడు.
ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదని జోస్యం చెప్పాడు.ప్రస్తుతం జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య జరుగుతున్న సిరీస్‌లోపోయి పాకిస్తాన్ ఆడుకోవాలని తెలిపాడు. కనీసం వారిపైనా విజయం సాధిస్తే ఈ మెగా టోర్నీలో ఆడేందుకు ఆర్హత ఉందని భావించవచ్చు. గేమ్ ప్లాన్ ఎలా ఉండాలో న్యూజిలాండ్‌ను చూసి నేర్చుకోవాలన్నారు.
పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా టీమిండియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టోర్నీలో కమ్‌బ్యాక్ ఇవ్వాలని పాక్ భావిస్తోంది. భారత్ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ-2017 ఫైనల్లో ఓటమికి బదులు తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది.