Australia vs New Zealand

Cairns, Sep 8: కెయిర్న్స్‌లో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 113 పరుగుల తేడాతో గెలిచి చాపెల్-హాడ్లీ సిరీస్‌ను (Chappell-Hadlee Series) కైవసం చేసుకుంది. అగ్రశ్రేణి న్యూజిలాండ్ (New Zealand) గురువారం ఆసీస్ బౌలర్ల అద్భుతమైన బౌలింగ్‌ ధాటికి 82 పరుగులకే కుప్పకూలింది.

మూడు మ్యాచ్‌ల షోడౌన్‌తో ఆదివారం ఉత్కంఠభరితమైన ప్రారంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (Australia) రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఈ విజయంతో ఆస్ట్రేలియా మరొక మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే సెప్టెంబర్‌ 11న(ఆదివారం) జరగనుంది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. స్టీవ్‌ స్మిత్‌ 61 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలవగా.. మ్యాక్స్‌వెల్‌ 25 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌ బౌలర్ల దాటికి టాపార్డర్‌, మిడిలార్డర్‌ కకావికలమైంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కనీసం 150 పరుగుల మార్క్‌ను దాటుతుందా అన్న అనుమానం కలిగింది.

అన్ని ఫార్మాట్ల‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సురేశ్ రైనా, ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్న‌ట్లు స్పష్టం, మ‌ద్ద‌తు ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ చెబుతూ ట్వీట్

అయితే చివర్లో మిచెల్‌ స్టార్క్‌(45 బంతుల్లో 38 నాటౌట్‌), జోష్‌ హాజిల్‌వుడ్‌(16 బంతుల్లో 23 పరుగులు నాటౌట్‌) చేయడంతో నిర్ణీత ఓవర్లలో 195 పరుగులు చేసింది. కివీస్‌ బౌలర్లలో బౌల్ట్‌ 4, మాట్‌ హెన్రీ 3, సౌథీ, సాంట్నర్‌ చెరొక వికెట్‌ తీశారు. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ 33 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలి 113 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఇక న్యూజిలాండ్‌ బ్యాటర్లు కూడా ఆస్ట్రేలియాను మించిపోయేలా దారుణంగా మ్యాచ్‌ను ప్రారంభించారు. కేన్‌ విలియమ్సన్‌ 17, మిచెల్‌ సాంట్నర్‌ 16 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా ఐదు వికెట్లతో కివీస్‌ నడ్డి విరిచాడు. సీన్‌ అబాట్‌, మిచెల్‌ స్టార్క్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. మార్కస్‌ స్టోయినిస్‌ ఒక వికెట్‌ తీశాడు.