Chris Morris (Photo Credits: PTI)

ఇండియన్ ప్రీమియర్ లీగ్- 2021 (Indian Premier League- 2021) ఆటగాళ్ల వేలం  గురువారం ప్రారంభమైంది. సీజన్ -14 కోసం మొత్తం 292 మంది క్రికెటర్లు వేలానికి అందుబాటులో ఉన్నారు. వీరిలో 164 మంది భారతీయ ఆటగాళ్లు కాగా, విదేశీ ఆటగాళ్ల సంఖ్య 125 గా ఉంది. అసోసియేట్ నేషన్స్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు కూడా ఉన్నారు.

ఈ సారి మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలకు కలిపి 61 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ 8 ఫ్రాంచైజీలు వారికి నిర్ధేషించిన బడ్జెట్ మరియు అందుబాటులో ఉన్న స్లాట్ల ప్రకారం ఆటగాళ్లను వేలం (IPL 2021 Auction)లో కొనుక్కోవాల్సి ఉంటుంది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ అత్యధికంగా 11 స్లాట్లు మరియు రూ.35.4 కోట్ల ఖజానాను కలిగి ఉండగా, సన్ రైజర్స్ హైదరాబాద్ వద్ద కేవలం 3 స్లాట్లు మరియు రూ. 10.75 ఖజానా కలిగి ఉంది. ఇక అత్యధికంగా పంజాబ్ ఫ్రాంచైజీ ఖజానాలో రూ. 53.20 కోట్లు అందుబాటులో ఉండగా, ఈ ఫ్రాంచైజీకి 9 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. రాబోయే సీజన్ కోసం పంజాబ్ జట్టు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ పేరుకు బదులుగా "పంజాబ్ కింగ్స్" గా పేరు మార్చుకొని ఆటలో నిలవనుంది. అనిల్ కుంబ్లె పంజాబ్ జట్టుకు కోచ్ గా వ్యవహరించనున్నారు.

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా గత ఏడాది యుఎఇలో జరిగిన ఐపీఎల్, 14వ సీజన్ కోసం తిరిగి భారతదేశంలోనే నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ లోని పిచ్ లకు తగినట్లుగా భారీ హిట్టర్లతో పాటు స్లో బౌలర్లపై కూడా ఫ్రాంచైజీలు దృష్టి పెట్టాయి.

ఫ్రాంచైజీల వారీగా అందుబాటులో ఉన్న స్లాట్లు, బడ్జెట్

 

CSK: రూ .3.65 కోట్లు మిగిలి ఉన్నాయి. విదేశీ స్లాట్లు లేవు. మొత్తం 4 స్లాట్లు మిగిలి ఉన్నాయి

DC: రూ .9.4 కోట్లు మిగిలి ఉన్నాయి. 2 విదేశీ స్లాట్లు. మొత్తం 2 స్లాట్లు మిగిలి ఉన్నాయి

KKR: రూ .7.35 కోట్లు మిగిలి ఉన్నాయి. 1 విదేశీ స్లాట్లు. మొత్తం 6 స్లాట్లు మిగిలి ఉన్నాయి

MI: రూ . 4.75 కోట్లు మిగిలి ఉన్నాయి.  2 విదేశీ స్లాట్లు. మొత్తం 4 స్లాట్లు మిగిలి ఉన్నాయి

PK: రూ .24.45 కోట్లు మిగిలి ఉన్నాయి. 2 విదేశీ స్లాట్లు. మొత్తం 5 స్లాట్లు మిగిలి ఉన్నాయి

RR: రూ .14.8 కోట్లు మిగిలి ఉన్నాయి. 1 విదేశీ స్లాట్లు. మొత్తం 4 స్లాట్లు మిగిలి ఉన్నాయి

RCB: రూ .20.55 కోట్లు మిగిలి ఉన్నాయి. 2 విదేశీ స్లాట్లు. మొత్తం 7 స్లాట్లు మిగిలి ఉన్నాయి

SRH: రూ .10.45 కోట్లు మిగిలి ఉన్నాయి. 1 విదేశీ స్లాట్లు. మొత్తం 2 స్లాట్లు మిగిలి ఉన్నాయి.

వేలంలో క్రిస్ మోరిస్ కు కాసుల పంట

సౌత్ ఆఫ్రికా ఆల్- రౌండర్ క్రిస్ మోరిస్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరను పలికాడు. వేలంలో రాజస్థాన్, బెంగళూరు మరియు ముంబై ఫ్రాంచైజీలు అతడి కోసం పోటాపోటీగా బిడ్లు వేశాయి. చివరకు రూ. 16.25 కోట్ల రికార్డ్ ధరకు రాజస్థాన్ రాయల్స్ టీమ్ క్రిస్ మోరిస్ ను దక్కించుకుంది.

గత సీజన్లో క్రిస్ మోరిస్ రూ. 10 కోట్లకు  బెంగళూరు టీమ్ దక్కించుకుంది.

ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్ మెన్ మాక్స్ వెల్ కోసం కూడా ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరకు బెంగళూరు టీమ్ అతణ్ని రూ. 14.25 కోట్లు పోసి కొనుగోలు చేసింది.

మరో ఆసీస్ ఆటగాడు రిచర్డ్ సన్ కూడా జాక్ పాట్ కొట్టేశాడు. ఈ ఫాస్ట్ బౌలర్ ను పంజాబ్ కింగ్స్ రూ. 14 కోట్లకు దక్కించుకుంది.