Narendra Shah (Photo-Twitter/File Image)

ఇండియన్ ఉమెన్ క్రికెట‌ర్ స్నేహ్ రానా కోచ్ న‌రేంద్ర షాపై లైగింక వేధింపుల కేసు న‌మోదు అయింది. అమ్మాయిని వేధిస్తున్న‌ట్టు ఆడియో ఆధారం ల‌భించ‌డంతో అత‌డిపై ఉత్త‌రాఖండ్ పోలీసులు పోక్సో(POCSO Act) చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. అయితే ఆడియో లీక్ విష‌యం తెలియ‌గానే నరేంద్ర షా ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు. ప్ర‌స్తుతం ఆయన ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు.

నరేంద్ర షా డెహ్రాడూన్‌లో క్రికెట్‌ అకాడమీ నిర్వహిస్తున్నాడు. మోలి జిల్లాకు చెందిన ఓ మైన‌ర్ యువతి చ‌దువుకుంటూనే నరేంద్ర షా క్రికెట్ అకాడమీలో శిక్ష‌ణ తీసుకుంటోంది. కొన్నాళ్లుగా న‌రేంద్ర సదరు యువతితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించేవాడు. మైనర్‌తో నరేంద్ర షా ఫోన్‌లో అస‌భ్య‌క‌రంగా మాట్లాడిన ఆడియో క్లిప్‌ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌గా నితీశ్‌ రాణా, సంచలన నిర్ణయం తీసుకున్న కెకెఆర్, గాయంతో టోర్నీకి దూరమైన కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌

ఆ ఆడియో వైర‌ల్ కావ‌డంతో అత‌డిపై పోక్సో చ‌ట్టం, ఐపీసీ సెక్ష‌న్ 506తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చ‌ట్టం కింద కేసు బుక్ చేశామ‌ని నెహ్రూ కాల‌నీ పోలీస్ స్టేష‌న్ ఇంఛార్జ్ లోకేంద్ర బ‌హుగుణ తెలిపాడు. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేశామ‌ని ఆయ‌న వెల్ల‌డించాడు. ఆడియో లీకేజీతో తన పరువు పోయిందని నరేంద్ర ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్ర‌స్తుతం స్నేహ్ రానాకు కోచ్‌గా ఉన్న న‌రేంద్ర షా ఉత్త‌రాఖండ్ క్రికెట్ సంఘం మాజీ స‌భ్యుడు. న‌రేంద్రపై పోక్సో కేసు న‌మోదైనట్లు తెలుసుకున్న ఉత్త‌రాఖండ్ క్రికెట్ అసోసియేష‌న్ అత‌డిని ప‌ద‌వి నుంచి తొల‌గించింది.