Ravindra Jadeja (photo/IPL CSK)

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా సంచలన రికార్డు నమోదు చేశాడు. 17 ఏళ్ల క్యాష్‌ ఐపీఎల్ చరిత్రలో 1000 పరుగులు సాధించి, 100 వికెట్లు పడగొట్టి, 100 క్యాచ్‌లు పట్టుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌ 2024లో భాగంగా కేకేఆర్‌తో నిన్న (ఏప్రిల్‌ 8) జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ క్యాచ్‌ పట్టడం ద్వారా జడ్డూ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో 100 క్యాచ్‌ల మైలురాయిని తాకాడు.  కోల్ కతా నైట్ రైడర్స్ విజయాలకు చెక్ పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్...

231 మ్యాచ్‌ల ఐపీఎల్‌ కెరీర్‌లో జడేజా 2776 పరుగులు చేసి 156 వికెట్లు పడగొట్టాడు. జడ్డూ ఖాతాలో రెండు అర్దసెంచరీలు, ఓ ఐదు వికెట్ల ఘనత ఉంది. కేకేఆర్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్‌లో, ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శనలకు గాను జడేజాకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. ఈ అవార్డుతో జడ్డూ సీఎస్‌కే తరఫున అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా ధోని సరసన చేరాడు. ఐపీఎల్‌లో ధోని సైతం సీఎస్‌కే తరఫున 15 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్నాడు.