ఐపీఎల్ 14వ సీజన్‌లో చెన్నై మరో విజయాన్ని నమోదు చేసింది. రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ షో (Jadeja’s All-Round Show) కనబరచడంతో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో (CSK vs RCB, IPL 2021 Stat Highlights) 69 పరుగులతో ఘన విజయాన్ని అందుకుంది. 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. పడిక్కల్(34) మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. మ్యాక్స్‌వెల్ 22 పరుగులు చేయగా.. మిగతావారు సీఎస్‌కే బౌలర్ల దాటికి అలా వచ్చి ఇలా వెళ్లారు.
సీఎస్‌కే బౌలర్లలో జడేజా 3, తాహిర్ 2, శార్ధూల్, సామ్ కరన్ చెరో వికెట్ తీశారు.తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఆడిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. సీఎస్‌కే బ్యాటింగ్‌లో జడేజా 62 నాటౌట్ మెరుపులు మెరిపించగా.. డుప్లెసిస్ 50 పరుగులతో రాణించాడు. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, చహల్ ఒక వికెట్ తీశారు.
టాస్ గెలిచిన చెన్నై బ్యాటింగ్ ఎంచుకోగా ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (25 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 33), డుప్లెసి ఆరంభం నుంచే చెలరేగారు. నాలుగో ఓవర్‌లో డుప్లెసి.. ఆరో ఓవర్‌లో రుతురాజ్ రెండేసి ఫోర్లు బాదడంతో పవర్‌ప్లేలో జట్టు 51 రన్స్ కొట్టింది. చాహల్ ఓవర్‌లో సిక్సర్‌తో గేరు మార్చే ప్రయత్నంలో ఉన్న రుతురాజ్ పదో ఓవర్‌లో అతడికే చిక్కాడు. తొలి వికెట్‌కు 74 రన్స్ జత చేరాయి. ఆ తర్వాత మూడు సిక్సర్లతో ధాటిగా ఆడిన రైనాను, హాఫ్ సెంచరీ చేసిన డుప్లెసిని 14వ ఓవర్‌లో హర్షల్ పటేల్ పెవిలియన్ చేర్చాడు.
జడేజా ఖాతా తెరవకముందే ఇచ్చిన క్యాచ్‌ను క్రిస్టియన్ వదిలేయగా.. 16వ ఓవర్‌లో రవీంద్ర జడేజా రెండు ఫోర్లు, రాయుడు (14) సిక్సర్‌తో చెన్నైకి 17 రన్స్ వచ్చాయి. కానీ మరుసటి ఓవర్‌లో సిరాజ్ 6 పరుగులే ఇచ్చాడు. 18వ ఓవర్‌లో రాయుడును హర్షల్ అవుట్ చేశాడు. 19వ ఓవర్ ముగిసేసరికి చెన్నై స్కోరు 154/4 గా ఉంది. ఇక మూడు ఓవర్లలో 14 పరుగులకే 3 వికెట్లు తీసిన హర్షల్ ఆఖరి ఓవర్ వేసేందుకు రెడీ అయ్యాడు. ఆ ఓవర్ లో జడేజా 6, 6, 6 నోబ్, 6, 2, 6, 4తో ఏకంగా 37 పరుగులు రాబట్టడంతో చెన్నై స్కోరు 191 చేరింది.
6️⃣6️⃣6️⃣6️⃣2️⃣6️⃣4️⃣
When 'Sir Jadeja' put Harshal Patel to the 'sword' 😛🔥
🎥 Video courtesy: @IPL#CSKvRCB #IPL #IPL2021 #RavindraJadeja #SirJadeja #DilSeDilli #DelhiBulls @imjadeja pic.twitter.com/5mmaI3mkUD
— Delhi Bulls (@DelhiBullsT10) April 25, 2021
భారీ ఛేదనలో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ ఓపెనర్ దేవ్‌దత్ క్రీజులో ఉన్నంతవరకు ఇన్నింగ్స్ ధాటిగా సాగింది. తొలి ఓవర్‌లో 2 ఫోర్లు.. రెండో ఓవర్‌లో 2 సిక్సర్లు.. మూడో ఓవర్‌లో 3 ఫోర్లు ఇలా సాగింది దేవ్‌దత్ ఇన్నింగ్స్. దీంతో తొలి మూడు ఓవర్లలో ఆర్‌సీబీ స్కోరు 44కు చేరింది. కానీ నాలుగో ఓవర్‌లో ఒక్క పరుగే ఇచ్చిన సామ్ కర్రాన్.. కోహ్లీ (8) వికెట్ తీశాడు. ఇక ఐదో ఓవర్‌లో అత్యంత ప్రమాదకరంగా మారిన పడిక్కళ్‌ను శార్దూల్ అవుట్ చేశాడు. పవర్‌ప్లేలో 65/2 స్కోరుతో జోరు మీదున్న ఆర్‌సీబీ ఆ తర్వాత జడేజా స్పిన్ ఉచ్చులో చిక్కుకుంది. జడేజా వరుస ఓవర్లలో సుందర్ (7), మ్యాక్స్‌వెల్ (22), డివిల్లీర్స్ (4) వికెట్లు తీశాడు. అటు తాహిర్ 2 వికెట్లతో చెలరేగి బెంగళూరు ఓటమిని ఖరారు చేశాడు.
స్కోరు బోర్డు, చెన్నై: రుతురాజ్ (సి) జెమీసన్ (బి) చాహల్ 33, డుప్లెసిస్ (సి) క్రిస్టియన్ (బి) హర్షల్ 50, రైనా (సి) పడిక్కల్ (బి) హర్షల్ 24, రాయుడు (సి) జెమీసన్ (సి) హర్షల్ 14, జడేజా (నాటౌట్) 62, ధోనీ (నాటౌట్) 2: ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 191/4. వికెట్ల పతనం: 1-74, 2-111, 3-111, 4-142, బౌలింగ్: సిరాజ్ 4-0-32-0, జెమీసన్ 3-0-31-0, చాహల్ 3-0-24-1, సైనీ 2-0-27-0, హర్షల్ 4-0-51-3, క్రిస్టియన్ 2-0-12-0, సుందర్ 2-0-13-0.
బెంగళూరు: కోహ్లీ (సి) ధోనీ (బి) కరన్ 8, పడిక్కల్ (సి) రైనా (బి) శార్దూల్ 34, సుందర్ (సి) గైక్వాడ్ (బి) జడేజా 7, మ్యాక్స్‌వెల్ (బౌల్డ్) జడేజా 22, డివిలియర్స్ (బి) జడేజా 4, క్రిస్టియన్ (రనౌట్/జడేజా) 1, జెమీసన్ (రనౌట్/తాహిర్) 16, హర్షల్ (బి) తాహిర్ 0, సైనీ (సి) రైనా (బి) 2, చాహల్ (నాటౌట్) 8, సిరాజ్ (నాటౌట్) 12. ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 20 ఓవర్లలో 122/9. వికెట్ల పతనం: 1-44, 2-54, 3-65, 4-79, 5-81, 6-83, 7-89, 8-94, 9-103, బౌలింగ్: దీపక్ చాహర్ 2-0-25-0, కరన్ 4-0-35-1, శార్దూల్ 4-0-11-1, జడేజా 4-1-13-3, తాహిర్ 4-0-16-2, బ్రావో 2-0-19-0.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ నె,ర పా
చెన్నై 5 4 1 1.61 8
ఢిల్లీ 5 4 1 0.33 8
బెంగళూరు 5 4 1 0.09 8
ముంబై 5 2 3 -0.03 4
పంజాబ్ 5 2 3 -0.42 4
రాజస్థాన్ 5 2 3 -0.68 4
హైదరాబాద్ 5 1 4 -0.18 2
కోల్‌కతా 5 1 4 -0.67 2
ఆ-ఆడినవి, గె-గెలుపు, ఓ-ఓటమి, నె.ర-నెట్ రన్‌రేట్, పా-పాయింట్లు