New Delhi, March 31: ఐపీఎల్‌లో (IPL) బోణీ కొట్టని ఢిల్లీ (Delhi Win) హ్యాట్రిక్ ఓటమి తప్పించుకుంది. కీలక పోరులో సంచలన ప్రదర్శనతో చెన్నైకి (CSK) చెక్ పెట్టింది. భారీ ఛేదనలో చెన్నై చెన్నై సూపర్ కింగ్స్‌ను ఖలీల్ అహ్మద్ ఆదిలోనే హడలెత్తించాడు. వరుస ఓవర్లలో రుతురాజ్ గైక్వాడ్(1), రచిన్ రవీంద్ర(2)లను ఔట్ చేశాడు. ఆ తర్వాత అజింక్యా రహానే(45), డారిల్ మిచెల్(34)లు కీలక భాగస్వామ్యం నిర్మించారు. దాంతో, బంతి అందుకున్న ముకేశ్ కుమార్ చెన్నైని ముంచాడు. ఒకే ఓవర్లో వరుస బంతుల్లో రహానే(45), రిజ్వీ(1)లను వెనక్కి పంపాడు. అప్పటికీ 15 ఓవర్లకు స్కోర్.. 112/5 . సిక్సర్ల శివం దూబే(18) క్రీజులో ఉండడంతో పంత్ పేసర్లతో అటాక్ చేయించి ఫలితం రాబట్టాడు. గత రెండు మ్యాచుల్లో నాటౌట్‌గా సీఎస్కేను గెలిపించిన దూబేను ముకేశ్ ఔట్ చేసి ఢిల్లీని గెలుపు వాకిట నిలిపాడు. ఆఖర్లో జడేజా(21 నాటౌట్), ధోనీ(37 నాటౌట్)లు పోరాడినా ఓటమి తప్పించలేకపోయారు. ఆఖరి ఓవర్లో 41 రన్స్ అవసరం కాగా.. మొదటి బంతికి ధోనీ బౌండరీ బాదాడు. ఆ తర్వాత సిక్సర్, ఆఖరి బంతికి సిక్సర్.. 20 రన్స్ వచ్చాయంతే.
Match 13. Delhi Capitals Won by 20 Run(s) https://t.co/8ZttBSkfE8 #TATAIPL #IPL2024 #DCvCSK
— IndianPremierLeague (@IPL) March 31, 2024
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఓపెనర్లు డేవిడ్ వార్నర్(52), పృథ్వీ షా(43)లు శుభారంభమిచ్చారు. తావివ్వకుండా తొలి వికెట్‌కు 93 రన్స్ జోడించారు. ఈ జోడీని ముస్తాఫిజుర్ విడదీశాడు. ఆ కాసేపటికే జడేజా ఓవర్లో షా.. ధోనీకి చిక్కాడు. మార్ష్(18)ను పథిరన సూపర్ యార్కర్‌తో బౌల్డ్ చేయడంతో ఢిల్లీ స్కోర్ నెమ్మదించింది. అయితే.. కెప్టెన్ పంత్ (Rishabh Pant) ఎంటరయ్యాక ఢిల్లీ స్కోర్ బోర్డు పరుగులెత్తింది. పథిరణ వేసిన 19వ ఓవర్లో పంత్ చితక్కొట్టాడు. వరుసగా 6,4,4, బాది అర్ధ శతకం సాధించాడు. పునరాగమనం తర్వాత ఫామ్ చాటుకున్న పంత్‌కు ఇది తొలి ఫిఫ్టీ కావడం విశేషం. నాలుగో బంతికి భారీ షాట్ ఆడబోయిన పంత్.. గైక్వాడ్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత అభిషేక్ పొరెల్(9 నాటౌట్), అక్షర్ పటేల్(7 నాటౌట్)లు జట్టు స్కోర్ 180 దాటించారు.
వార్నర్ (David Warner) ఈ మ్యాచ్‌లో అరుదైన ఘనతకు చేరువయ్యాడు. టీ20ల్లో 110వ అర్ధ శతకం నమోదు చేశాడు. ఈ ఫీట్‌తో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డు సమం చేశాడు. విరాట్ కోహ్లీ(101), బాబర్ ఆజాం(98)లు వరుసగా రెండు, మూడో స్థానాల్లో కొనసాగుతున్నారు.