MS Dhoni (Photo credit: Twitter)

New Delhi, April 01: ఐపీఎల్ 16వ సీజన్ (IPL 16) అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగింది. అయితే, గుజరాత్ టైటాన్స్ (Gujrattitans) ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఇద్దరు ఆటగాళ్లను గాయాల బెడద వేధించింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఎంఎస్ ధోనీ (MS Dhoni), గుజరాత్ టైటాన్స్ లో మిలియమ్సన్. దీంతో వీరిద్దరూ ఆయా జట్టు తదుపరి ఆడే మ్యాచ్ కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ కీపింగ్ సమయంలో బంతిని పట్టుకొనే సమయంలో మోకాలి నొప్పి కారణంగా ఇబ్బంది పడటం కనిపించింది. ధోనీ మ్యాచ్ ప్రారంభానికి ముందు కూడా మోకాలి గాయంతో ఇబ్బంది పడ్డాడు. ప్రాక్టీస్ సమయంలో పట్టీని ఉపయోగించడం కనిపించింది.

IPL 2023 Gujarat Titans vs Chennai Super Kings: గుజరాత్ టైటాన్స్ ఆరంభం అదుర్స్, తొలి మ్యాచులోనే చెన్నై చిత్తు.. 

తొలి మ్యాచ్ కు ధోనీ అందుబాటులో ఉండరనే ప్రచారం కూడా జరిగింది. కానీ ధోనీ తొలి మ్యాచ్ లో ఆడినప్పటికీ మోకాలి గాయంతో ఇబ్బందిపడినట్లు స్పష్టంగా కనిపించింది. ఈ విషయంపై జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ఎంఎస్ ధోనీకి కేవలం కాలు తిమ్మిరి మాత్రమే. మోకాలి సమస్య లేదన్నారు. సీఎస్‌కే తదుపరి మ్యాచ్ లో ధోనీ ఆడతాడని ఫ్లెమింగ్ చెప్పారు.

PBKS vs KKR Highlights, IPL 2023: ఐపీఎల్‌లో కోల్‌కతా బోణీ, డక్‌వర్త్ లూయిస్ ప్రకారం పంజాబ్‌పై గెలుపు, రసవత్తరంగా సాగుతున్న మ్యాచ్‌కు వరుణుడి అడ్డంకి 

గుజరాత్ టైటాన్స్ జట్టులో స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ గాయపడ్డాడు. ఇప్పుడు విలియమ్సన్ స్థానంలో స్టీవ్ స్మిత్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో స్టీవ్ స్మిత్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. కానీ, ఇప్పుడు విలియమ్సన్ గాయం తరువాత ఐపీఎల్ 2023 కోసం స్మిత్ గుజరాత్ టైటాన్స్ జట్టులో చేరొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్మిత్ ను మినీ వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ విలియమ్సన్ స్థానంలో స్మిత్ ను జట్టులోకి తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఎంత వరకు అవకాశాలు ఉన్నాయనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ విలియమ్సన్ గాయం వెంటనే నయం అయితే అతన్నే కొనసాగించొచ్చు.